వాషింగ్టన్, డి.సి., 3 ఏప్రిల్ (హి.స.)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలపై కీలక ప్రకటన చేశారు. లిబరేషన్ డే సందర్భంగా 60కి పైగా దేశాలపై ఆయన ప్రతీకార సుంకాలను ప్రకటించారు. అలాగే అధికారిక ఉత్తర్వులపై కూడా ట్రంప్ సంతకాలు చేశారు. ఇతర దేశాలపై విధించిన టారిఫ్‌లు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు..ట్రంప్. ఈ రోజును ‘లిబరేషన్ డే’గా అభివర్ణించిన ట్రంప్..అమెరికా ఇండస్ట్రీ ఈరోజు పునర్జన్మించిందని చెప్పారు. అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారని మండిపడ్డ ట్రంప్.. ఇక అలా జరగదని స్పష్టం చేశారు. తమపై సుంకాలు విధించే దేశాలపై తాము కూడా తప్పకుండా సుంకాలు విధిస్తామని..అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాలు స్టీల్, ఆటో కార్మికులను కూడా ఆహ్వానించారు..ట్రంప్.
భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు..
వాణిజ్యంలో కొన్నిసార్లు శత్రువు కంటే స్నేహితుడు చాలా ప్రమాదకరమన్నారు ట్రంప్. దిగుమతి చేసుకుంటున్న ఆటో మొబైల్స్‌పై అమెరికా కేవలం 2.4 శాతం సుంకాలు మాత్రమే విధిస్తోందని..కానీ కొన్ని దేశాలు తమ ఉత్పత్తులపై భారీ టారిఫ్స్ అమలు చేస్తున్నాయన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి