ఏపీలో ఎల్జీ ఎలెక్ట్రానిక్ కొత్త.తయారీ.యూనిట్. ఏర్పాటు పై.సీఎం.చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు
విజయవాడ, 8 మే (హి.స.) అమరావతి: ఏపీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ కొత్త తయారీ యూనిట్‌ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు హర్షం ప్రకటించారు. ఎల్‌జీకి ఆంధ్రప్రదేశ్ ఆహ్వానం పలుకుతోందంటూ ట్వీట్‌ చేశారు. శ్రీసిటీలో రూ.5,800కోట్లకు పైగా పెట్టుబడులతో ప్రత్యక్షంగా, పరోక్షంగ
ఏపీలో ఎల్జీ ఎలెక్ట్రానిక్ కొత్త.తయారీ.యూనిట్. ఏర్పాటు పై.సీఎం.చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు


విజయవాడ, 8 మే (హి.స.)

అమరావతి: ఏపీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ కొత్త తయారీ యూనిట్‌ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు హర్షం ప్రకటించారు. ఎల్‌జీకి ఆంధ్రప్రదేశ్ ఆహ్వానం పలుకుతోందంటూ ట్వీట్‌ చేశారు. శ్రీసిటీలో రూ.5,800కోట్లకు పైగా పెట్టుబడులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,500పైగా ఉద్యోగాలతో ఈ సంస్థ ఏపీని ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక కమిటీ(SIPC) కింద ఈ సంస్థ 100శాతం ప్రోత్సాహకాలు పొందిందని సీఎం తెలిపారు. ఇది మన రాష్ట్రంలోని పారిశ్రామిక వృద్ధికి ఒక ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలికిందని పేర్కొంటూ శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌కు మంత్రి నారా లోకేశ్‌ నేడు శంకుస్థాపన చేసిన అనంతరం దిగిన ఫొటోను సీఎం షేర్‌ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande