తెలంగాణ, మహబూబ్ నగర్ 9 మే (హి.స.) మహబూబ్ నగర్ జిల్లాలోని
మక్తల్ పట్టణంలో రూ.50కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 150పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఇవాళ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి భవన నిర్మాణ నమూనాను పరిశీలించి నిర్మాణపనులు ఎప్పటిలోగా పూర్తవుతాయి.. వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.పనులను త్వరితగతిన చేపట్టి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. నిర్ణీత సమయంలోగా నిర్మాణ పనులను పూర్తి చేసి వైద్య సేవలు అందించేందుకు అందుబాటులోకి తీసుకురావలసిందిగా అధికారులను కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు