విజయవాడ, 9 మే (హి.స.)
గుంటూరు కలెక్టరేట్: జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు సగటున 7.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లిపర మండలంలో అత్యధికంగా 68.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదుకాగా, తెనాలి 42, తుళ్ళూరు 5.4, పెదనందిపాడు 3.2, చేబ్రోలు 2.8, తాడికొండ 2.6, ఫిరంగిపురం 1.6, ప్రత్తిపాడు 1.2, మేడికొండూరు 0.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల