ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన అత్యవసరo.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ, వికారాబాద్. 9 మే (హి.స.) నేటి సమాజంలో జీవించే ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన అత్యవసరమైనదని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండల పరిధిలోని సయ్యదలిపూర్ గ్రామంలోని హనుమాన్ మందిరంలో శుక్రవార
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్


తెలంగాణ, వికారాబాద్. 9 మే (హి.స.)

నేటి సమాజంలో జీవించే ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన అత్యవసరమైనదని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండల పరిధిలోని సయ్యదలిపూర్ గ్రామంలోని హనుమాన్ మందిరంలో శుక్రవారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన, నవగ్రహ ప్రతిష్టాపన, నాభి శిలా (బొడ్రాయి) కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… మారుమూల గ్రామమైన సయ్యదలి‌ పూర్ గ్రామంలో ప్రజలకు ఇంత ఆధ్యాత్మిక చింతన ఉండడం నిజంగా గ్రామ ప్రజలు అదృష్టవంతులన్నారు. నేటి ఆధునిక సమాజంలో ఎన్నో సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు ఉన్న సమయంలో ఆధ్యాత్మిక చింతనతో ఇలాంటి దైవ కార్యక్రమాలు నిర్వహించడం గ్రామానికి శుభ సూచకమన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande