తెలంగాణ, 9 మే (హి.స.)
గంజాయిని తరలిస్తున్న జలీలోద్దీన్ సిద్దిఖి అహ్మమద్ హుస్సెన్ అనే వ్యక్తి ని శుక్రవారం సంగారెడ్డి ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడు సీలేరు నుంచి గంజాయిని తీసుకొని మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తూ ఉంటాడు. లక్ష్మీబాయి అనే మహిళ వద్ద 20.6 కేజీల గంజాయిని తీసుకొని జాతీయ రహదారి 65 గుండా కారులో వెళ్తుండగా ఎస్టి ఎఫ్ ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డి టీమ్ పట్టుకుని జలీలోద్దీన్ సిద్దిఖి అహ్మమద్ హుస్సెన్, లక్ష్మీబాయి అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.10 లక్షలు ఉంటుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు