ఏ.పీ, విశాఖపట్నం. 9 మే (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బెంగళూరు, భువనేశ్వర్, అబుదాబికి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విమానయాన సర్వీసుల విస్తరణతో రాష్ట్రమంతటా కనెక్టివిటీని పెంచేందుకు కొత్త విమానాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. విశాఖ – అబుదాబి మధ్య జూన్ 13 నుంచి, విశాఖ- భువనేశ్వర్ విమాన సర్వీసు జూన్ 12 నుంచి, విజయవాడ- బెంగళూరు మధ్య ఎయిరిండియా ఎక్సప్రెస్ సర్వీసులు జూన్ 2 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..