అమరావతి, 8 జూలై (హి.స.)ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా(92) మణికొండలోని తన నివాసంలో కన్నుమూశారు. శివశక్తి దత్తా మృతి పై ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ‘‘ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి తండ్రి, రచయిత, చిత్రకారులు శివశక్తి దత్తా కన్ను మూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. కళలు, సాహిత్యం పై ఎంతో అభిమానం కలిగినవారాయన. తెలుగు, సంస్కృత సాహిత్యాల పై పట్టున్న శివశక్తి దత్తా పలు చలనచిత్రాలకు గీత రచన చేశారు. పితృ వియోగం తో బాధపడుతున్న కీరవాణికి, ఆయన సోదరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ ఎక్స్(X) వేదికగా పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి