‘సూపర్ సార్ మీరు’.. ఆ టీచర్ పై మంత్రి లోకేష్ ప్రశంసల జల్లు
అమరావతి, 8 జూలై (హి.స.)ఓ ఉపాధ్యాయుడి ఆలోచనను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) అభినందించారు. స్కూల్‌కి విద్యార్థులు రాకపోవడానికి కారణం సరైన మార్గం లేకపోవడమే అని భావించిన ఓ ఉపాధ్యాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సరైన మార్గం లేకపోవడమే
‘సూపర్ సార్ మీరు’.. ఆ టీచర్ పై మంత్రి లోకేష్ ప్రశంసల జల్లు


అమరావతి, 8 జూలై (హి.స.)ఓ ఉపాధ్యాయుడి ఆలోచనను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) అభినందించారు. స్కూల్‌కి విద్యార్థులు రాకపోవడానికి కారణం సరైన మార్గం లేకపోవడమే అని భావించిన ఓ ఉపాధ్యాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సరైన మార్గం లేకపోవడమే విద్యార్థుల హాజరు పడిపోవడానికి కారణమని తెలుసుకున్న ఉపాధ్యాయుడు ఆ సమస్యను తన సొంత ఖర్చుతో పరిష్కరించారు. సమీపంలోని పంట కాలువ మీదుగా రూ.లక్ష సొంత నిధులతో కాలిబాట వంతెన నిర్మించారు.

పూర్తయ్యే దశలో ఉన్న ఈ బాట సాయంతో విద్యార్థులు సురక్షితంగా పాఠశాలకు వచ్చేందుకు వీలు కలుగుతుంది. ఈ విషయం మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆ ఉపాధ్యాయుడిని అభినందించారు. ఈ మేరకు ‘‘పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే మార్గదర్శి, పిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు మార్గం చూపించారు. సూపర్ సార్ మీరు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు శివారు సూరంపేట ప్రాథమిక పాఠశాలకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో తన సొంత నిధులతో కాలిబాట వంతెన ఏర్పాటు చేయించిన టీచర్ అనిశెట్టి సీతారామరాజు అభినందనలు’’ అని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande