తండ్రికి నివాళులర్పించిన మాజీ సీఎం జగన్
కడప , 8 జూలై (హి.స.) నేడు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Former CM YS Jagan) కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఇవాళ(జూలై 08) దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekhara Reddy) 76వ జయంతి(YSR Jayan
తండ్రికి నివాళులర్పించిన మాజీ సీఎం జగన్


కడప , 8 జూలై (హి.స.)

నేడు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Former CM YS Jagan) కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఇవాళ(జూలై 08) దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekhara Reddy) 76వ జయంతి(YSR Jayanthi) సందర్భంగా వైఎస్ జగన్ తన తండ్రికి నివాళులర్పించారు. ఈ రోజు ఉదయం వైఎస్సార్ ఘాట్(YSR Ghat Kadapa District ) వద్దకు చేరుకున్న మాజీ సీఎం జగన్, తన తండ్రి సమాధిపై పుష్పగుచ్ఛంతో శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు. అనంతరం తల్లిని వైఎస్ ఆప్యాయంగా పలకరించారు. దీంతో ఆమె కుమారుడు జగన్‌ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన పలువురు వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు.

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande