తెలంగాణ, వికారాబాద్. 10 జూన్ (హి.స.)
భూ సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం మండలంలోని రావులపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అర్జీదారుల సమస్యలను స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివరాల నమోదులో తప్పిదాలు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్ డెస్క్ లను, రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు