
అమరావతి, 06 మార్చి (హి.స.):ఏపీ శాసనసభ సమావేశాలు( నిరవధికంగా వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగేందుకు సహకరించిన అందరికీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృతజ్ఞతలు తెలిపారు. 16వ శాసనసభ ఐదో సమావేశాలు 15 రోజుల పాటు జరిగాయన్నారు. 72 గంటల 14 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయని తెలిపారు. మొత్తం 122 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని... 80 ప్రశ్నలకు సభాసమక్షంలో ఉంచారని చెప్పారు. ఈసారి సమావేశాల్లో 18 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. ఒక లఘు చర్చ, 344వ నియమం కింద చర్చించిన అంశాలు ఒకటి అని వివరించారు. శాసనసభలో టీడీపీ- 135, జనసేన-21, వైసీపీ-11, బీజేపీ-8 మంది సభ్యులున్నారని స్పీకర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ