ఎన్టీఆర్ జిల్లా.తిరువూరులో టెన్షన్.టెన్షన్
అమరావతి, 06 మార్చి (హి.స.) తిరువూరు: ఎన్టీఆర్ జిల్ల తిరువూరు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరువూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిపై టీడీపీ, విపక్ష వైసీపీ
ఎన్టీఆర్ జిల్లా.తిరువూరులో టెన్షన్.టెన్షన్


అమరావతి, 06 మార్చి (హి.స.)

తిరువూరు: ఎన్టీఆర్ జిల్ల తిరువూరు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరువూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిపై టీడీపీ, విపక్ష వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల కీలక నేతలు ‘బోసు బొమ్మ’ సెంటర్లో చర్చకు వెళ్తున్న విషయం తెలుసుకొని పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అనంతరం ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొని స్టేషన్కి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బోస్ బొమ్మ సెంటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande