అంబుబాచి మేళా 2025.. కామాఖ్య ఆలయానికి పోటెత్తిన భక్తులు
గువహాటి, 26 జూన్ (హి.స.)గువహాటి లోని కామాఖ్య ఆలయం (Kamakhya Temple)లో జరిగే అంబుబాచి మేళా 2025 (Ambubachi Mela 2025) సందర్భంగా గురువారం తెల్లవారు జామునే భక్తులు (The devotees) పోటెత్తారు. నివృత్తి తర్వాత ఆలయ ప్రధాన ద్వారం తెరిచినప్పుడు భక్తులు పెద్ద
అంబుబాచి మేళా 2025.. కామాఖ్య ఆలయానికి పోటెత్తిన భక్తులు


గువహాటి, 26 జూన్ (హి.స.)గువహాటి లోని కామాఖ్య ఆలయం (Kamakhya Temple)లో జరిగే అంబుబాచి మేళా 2025 (Ambubachi Mela 2025) సందర్భంగా గురువారం తెల్లవారు జామునే భక్తులు (The devotees) పోటెత్తారు. నివృత్తి తర్వాత ఆలయ ప్రధాన ద్వారం తెరిచినప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం కోసం చేరుకున్నారు. జూన్ 22 నుంచి జూన్ 26 వరకు జరిగిన అంబుబాచి మహా యోగ (మేళా) సందర్భంగా, కామాఖ్య దేవి ఆలయం నీలాచల్ కొండల (Nilachal Hills)పై భక్తుల రద్దీతో కళకళలాడింది. ఈ పర్వం సమయంలో, దేవి తన వార్షిక ఋతుచక్రంలో ఉన్నట్లు భావిస్తారు. దీని కారణంగా ఆలయం జూన్ 22 నుంచి జూన్ 25 వరకు భక్తుల కోసం మూసివేశారు. అనంతరం బుధవారం అర్ధరాత్రి ఆలయ ద్వారాలు తెరిచారు.

దీంతో ఈ రోజు తెల్లవారుజామునే.. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. కామాఖ్య ఆలయానికి భారత దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులతో పాటు.. విదేశాల నుంచి కూడా భక్తులు కామాఖ్య దేవి (Goddess Kamakhya) ఆశీస్సుల కోసం ఆలయానికి తండోపతండాలుగా వచ్చారు. ఈ మేళా 51 శక్తి పీఠాలలో ఒకటైన కామాఖ్య ఆలయంలో జరిగే అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande