దత్తాత్రేయది పేరుకు హిందుత్వం, మతం భారతీయం: సీఎం చంద్రబాబు
హైదరాబాద్, 8 జూన్ (హి.స.) బండారు దత్తాత్రేయది పేరుకు హిందుత్వం, మతం భారతీయమని సీఎం చంద్రబాబు కొనియాడారు. హైదరాబాదులో నేడు జరిగిన దత్తాత్రేయ రచించిన ''ప్రజల కథే నా ఆత్మకథ'' పుస్తకావిష్కరణకు ముఖ్యఅతిథిగా సీఎం పాల్గొని మాట్లాడారు. ''జెంటిల్ మెన్
దత్తాత్రేయ


హైదరాబాద్, 8 జూన్ (హి.స.)

బండారు దత్తాత్రేయది పేరుకు హిందుత్వం, మతం భారతీయమని సీఎం చంద్రబాబు కొనియాడారు. హైదరాబాదులో నేడు జరిగిన దత్తాత్రేయ రచించిన 'ప్రజల కథే నా ఆత్మకథ' పుస్తకావిష్కరణకు ముఖ్యఅతిథిగా సీఎం పాల్గొని మాట్లాడారు. 'జెంటిల్ మెన్ కు ప్రతిరూపం బండారు దత్తాత్రేయ. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా ఎదిగారు. బండారు దత్తాత్రేయ పాటించేది మత సామరస్యం. అలయ్ బలయ్ పేరుతో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చారు. దత్తాత్రేయది ఆదర్శ రాజకీయ జీవితం' అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఎంపీ రఘునందనరావు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande