హైదరాబాద్, 8 జూన్ (హి.స.)
బండారు దత్తాత్రేయతో వ్యక్తిగతంగా తనకు చాలా సన్నిహిత సంబంధం ఉందని సీఎం రేవంత్ చెప్పారు. 'అజాత శత్రువు అనే పదం బండారు దత్తాత్రేయకు సరిగ్గా సరిపోతుంది. దేశ స్థాయిలో అటల్ బిహారీ వాజ్ పేయిలా రాష్ట్రంలో బండారు దత్తాత్రేయ ఉన్నారు. జంటనగరాల్లో పేదలకు కష్టం వచ్చినపుడు గుర్తొచ్చేది ఇద్దరే నాయకులు.. ఒకరు పీజేఆర్, మరొకరు దత్తాత్రేయ. మేం తీసుకునే నిర్ణయాల్లో వీరి స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటుంది' అని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్