బిజెపి అధ్యక్ష ప్రకటన మీటింగ్.. ఈటల ఎంట్రీ.. నినాదాలతో మారు మ్రోగిన హాల్
హైదరాబాద్, 1 జూలై (హి.స.) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అధికారిక ప్రకటన కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో వేద కన్వెన్షన్లో ఇవాళ తెలంగాణ బీజేపీ సారధిగా రామచందర్రావు నియమక కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలోనే బిజ
ఈటెల


హైదరాబాద్, 1 జూలై (హి.స.)

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అధికారిక ప్రకటన కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో వేద కన్వెన్షన్లో ఇవాళ తెలంగాణ బీజేపీ సారధిగా రామచందర్రావు నియమక కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలోనే బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ హాల్లోకి వస్తున్న సమయంలో బీజేపీ శ్రేణులు సందడి చేశాయి. జై ఈటల, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో కన్వెన్షన్ మారు మ్రోగిపోయింది. అనంతరం కార్యక్రమంలో ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచందర్రావుకి శుభాకాంక్షలు తెలియజేశారు.

రామచంద్రరావు గారు నాకంటే చాలా పెద్దవారు కానీ.. నాకు ఆయనకు చాలా రోజుల నుంచి మంచి స్నేహం ఉందన్నారు. మా అన్నతో పాటు వెళ్ళినప్పుడల్లా ఆయనని కలిసేవాన్ని అని తెలిపారు. చదువుకునేటప్పుడు కూడా విద్యార్థి సంఘాల్లో పనిచేశాము.. 35 ఏళ్లుగా ఆయన్ను దగ్గర నుంచి చూసాము. సౌమ్యుడు, కమిట్మెంట్ ఉన్న కార్యకర్త అని కొనియాడారు. అనేక విషయాల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు అని, శాసనమండలిలో మేము మంత్రులుగా ఉన్నప్పుడు బీజేపీ నుంచి ఒక్కరే ఎమ్మెల్సీగా ఉన్నా.. ఆయన నిర్వహించిన పాత్ర ఎంత గొప్పగా ఉందో అని అనేకసార్లు ప్రశంసించామని అన్నారు. కార్యకర్తల నమ్మకాన్ని నడిపించడంలో తప్పకుండా ముందు భాగంలో ఉంటారని.. మేమందరము సంపూర్ణ సహకారం అందిస్తామని వారికి శుభాకాంక్షలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande