ట్రోల్ చేస్తే తాట తీస్తా.. తొలి స్పీచ్ లోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బీజేపీ నూతన అధ్యక్షుడు వార్నింగ్
హైదరాబాద్, 1 జూలై (హి.స.) తెలంగాణ బిజెపి నూతన అధ్యక్షునిగా ఎన్నికైన రామచంద్రరావు అధ్యక్ష హోదాలో నేడు తొలిసారిగా మాట్లాడుతూ.. బీజేపీ మాస్ క్యాడర్ పార్టీ అని సిద్ధాంత బలమున్న పార్టీ అన్నారు. కలిసికట్టుగా గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేద్దామని పిలుపున
బిజెపి అధ్యక్షుడు


హైదరాబాద్, 1 జూలై (హి.స.) తెలంగాణ బిజెపి నూతన అధ్యక్షునిగా ఎన్నికైన రామచంద్రరావు అధ్యక్ష హోదాలో నేడు తొలిసారిగా మాట్లాడుతూ..

బీజేపీ మాస్ క్యాడర్ పార్టీ అని సిద్ధాంత బలమున్న పార్టీ అన్నారు. కలిసికట్టుగా గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ యువత రాజకీయాల్లోకి రావాల్సిందే యువకులుల, మహిళలు బీజేపీలోకి రావాలని, 33 శాతం రిజర్వేషన్ల అమలుతో మహిళలకు ఎన్నో అవకాశాలు రాబోతున్నాయన్నారు. తెలంగాణ ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారు. పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వాట్సాప్ వర్శిటీలను పెట్టుకుని ఫేక్ న్యూస్ ను ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు దమ్ముంటే నేరుగా ఎదురుగా పోరాడదాం రండి. కానీ మీరు దమ్ములేని పిరికిపందలు కాబట్టే వెనుకుండి ఫేక్ న్యూస్ ట్రోల్ చేస్తున్నారని దుయ్యబట్టారు. నేను క్రిమినల్ లాయర్ ను ఫేక్ న్యూస్ సూత్రధారులను బోనులో నిలబెట్టేందుకూ వెనుకాడనన్నారు. రామచంద్రరావు సౌమ్యుడే కానీ యుద్ధంలోకి దిగితే యోధుడినే అన్నారు. ఏబీవీపీగా ఉన్నప్పుడే జైలుకు వెళ్లొచ్చినోడిని. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నోడిని. కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నా సిద్ధాంతాన్ని వీడకుండా పనిచేసినోడిని అన్నారు. విద్యార్థులు, న్యాయవాదులతో, పేదల పక్షాన న్యాయ పోరాటం చేశాసననని ఇకపై తెలంగాణ ప్రజల పక్షాన అలుపెరగని పోరాటాలకు సిద్ధంగా ఉన్నానన్నారు. కలిసికట్టుగా అందరితో కలిసి పనిచేస్తానని బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande