కాంగ్రెస్, బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దు: బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్, 1 జూలై (హి.స.) బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ట్రాప్లో పొడొద్దని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎన్నిక అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన
బండి సంజయ్


హైదరాబాద్, 1 జూలై (హి.స.)

బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ట్రాప్లో పొడొద్దని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎన్నిక అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నికైన రాంచందర్ రావు ఓ మిస్సైల్ లాంటి వ్యక్తి అని కొనియాడారు. మొదటి నుంచి పార్టీకి ఆయన నిస్వార్థంగా సేవ చేశారని గుర్తు చేశారు. విద్యార్థి నాయకుడిగా, పార్టీ లీగల్ అడ్వైజర్ గా, ఎమ్మెల్సీగా ఆయన చేసిన సేవలు ఎవరూ మరువలేరని అన్నారు. పార్టీలో అధ్యక్ష పదవిని ఎవరైనా అశించవచ్చని.. కానీ, అధిష్టానం నిర్ణయాన్ని కూడా పాటించాల్సిందేనని అన్నారు. రాబోయే రోజుల్లో రాంచందర్రావు నాయకత్వంలో అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తమ పార్టీని ట్రోల్ చేసినోళ్లు కాలగర్భంలో కలిసిపోయారని కామెంట్ చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దని అన్నారు. భారతీయ జనతా పార్టీలో ఎలాంటి గ్రూపులు ఉండవని.. తమ కెప్టెన్ నరేంద్ర మోడీ నే అని బండి సంజయ్ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande