గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ పై మంత్రి ఉత్తంకుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
హైదరాబాద్, 1 జూలై (హి.స.) హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ పై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల
మంత్రి ఉత్తం


హైదరాబాద్, 1 జూలై (హి.స.)

హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా

గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ పై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు నిరాకరించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై తమకున్న అభ్యంతరాలను కేంద్రం ఎదుట క్లియర్గా వివరించామని.. గోదావరి వాటర్ ట్రైబ్యునల్ అవార్డుకు ఇది వ్యతిరేకమని కూడా చెప్పినట్లు గుర్తుచేశారు.

కాగా, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని, అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) తీర్పును పరిశీలించాల్సి ఉందని తెలిపింది. పర్యావరణ అనుమతులకు సీడబ్ల్యూసీని సంప్రదించడం అత్యవసరమని కమిటీ అభిప్రాయపడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande