హైదరాబాద్, 1 జూలై (హి.స.)
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది, ఏబీవీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ఎంపికయ్యారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారి, కేంద్ర మంత్రి శోభా కరందాజే ఆయన పేరును అధికారికంగా నేటి మధ్యాహ్నం ప్రకటించారు. ఈ సందర్భంగా మన్నెగూడలో జరిగిన సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
వేదిక వద్ద ర్యాలీగా వచ్చిన నూతన అధ్యక్షుడికి ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రామచందర్ రావుకు శుభాకాంక్షలు తెలుపుతూ, పార్టీ విజయాలను మరింత పటిష్టం చేస్తారన్న ఆశాభావం వ్యక్తమయ్యింది
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..