ఉధృతంగా వరద గోదారి, వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయయి
భద్రాచలం , , 12 జూలై (హి.స.) వరద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన ప్రాణహిత నీరు గోదావరిలో కలుస్తుండటంతో భద్రాచలం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుత 37.2 అడుగులకు చేరుకుంది. దీంతో తర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన
వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయయి


భద్రాచలం , , 12 జూలై (హి.స.) వరద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన ప్రాణహిత నీరు గోదావరిలో కలుస్తుండటంతో భద్రాచలం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుత 37.2 అడుగులకు చేరుకుంది. దీంతో తర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.

నిన్న శుక్రవారం రాత్రి కి కాటన్‌ బ్యారేజ్‌ ధవళేశ్వరం 175గేట్లను ఎత్తి 3,54,341 క్యసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 9.70 అడుగులుగా ఉంది. భద్రాచలానికి దిగువన ముంపు మండలాలైన కుక్కునరు, వేలేరుపాడుల్లో వరద ముంపు తీవ్రత కనిపిస్తోంది. కుక్కునరు-దాచారం వర్గంలో గుండేటి వాగు కాజ్‌వేపై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయయి. వేలేరుపాడు మండలం ఎద్దువాగు కాజ్‌వేపై వరద పెరుగుతుండ డంతో 14 గ్రావలకు రాకపోకలు స్తంభించాయి. స్థానికులు పునరావాస కాలనీలకు తరలివెళుతు న్నారు. వరదలతో ఏలరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారు లను పంపింది. శనివారం తెల్లవారుజామున మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాబోతుందని యంత్రాంగమంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఏలరు కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మరోవైపు పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో... స్పిల్‌వే నుంచి 5,02,478 క్యసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande