మూడో టెస్టులో టీమిండియా స్టార్‌ కేఎల్‌ రాహుల్‌ శతకం
హైదరాబాద్, 12 జూలై (హి.స.)ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా స్టార్‌ కేఎల్‌ రాహుల్‌ శతకంతో మెరిశాడు. లార్డ్స్‌''లో నిలకడైన ప్రదర్శనతో 176 బంంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు ఉన్నాయి. కాగా రాహుల్‌కు ఇది టెస్టుల్ల
Rahul


హైదరాబాద్, 12 జూలై (హి.స.)ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా స్టార్‌ కేఎల్‌ రాహుల్‌ శతకంతో మెరిశాడు. లార్డ్స్‌'లో నిలకడైన ప్రదర్శనతో 176 బంంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు ఉన్నాయి.

కాగా రాహుల్‌కు ఇది టెస్టుల్లో పదో సెంచరీ కాగా.. ఇంగ్లండ్‌లో ఓవరాల్‌గా నాలుగోది. అదే విధంగా.. లార్డ్స్‌లో ఇది రెండోది కావడం విశేషం. తద్వారా దిలీప్‌ వెంగసర్కార్‌ తర్వాత లార్డ్స్‌ మైదానంలో రెండు శతకాలు సాధించిన రెండో భారత క్రికెటర్‌గా రాహుల్‌ చరిత్ర సృష్టించాడు.

అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీ పూర్తైన వెంటనే రాహుల్‌ అవుటయ్యాడు. ఇంగ్లండ్‌ యువ బౌలర్‌ షోయబ్‌ బషీర్‌ స్పిన్‌ మాయాజాలంలో చిక్కుకున్న రాహుల్‌.. హ్యారీ బ్రూక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో నిరాశగా రాహుల్‌ క్రీజును వీడాడు.

లార్డ్స్‌ మైదానంలో టెస్టుల్లో సెంచరీ చేసిన భారత క్రికెటర్లు వీరే

🏏దిలీప్‌ వెంగ్‌సర్కార్‌- 3

🏏కేఎల్‌ రాహుల్‌-2

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande