ఢిల్లీ, 12 జూలై (హి.స.) కర్నాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం సిద్దరామయ్య , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఊహించని షాకిచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ . మూడు రోజుల పాటు సిద్దరామయ్య , డీకే ఢిల్లీలో క్యాంప్ వేశారు, అయినప్పటికి ఇద్దరు నేతలకు రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ లభంచలేదు. ఇద్దరి తీరుపై రాహుల్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతర్గత కలహాలు మంచిదికాదని హైకమాండ్ స్పష్టం చేసినట్టు చెబుతున్నారు.
రాహుల్‌ను కలవకుండానే బెంగళూరుకు సిద్దరామయ్య, డీకే శివకుమార్ చేరుకున్నారు. 2028లో కూడా తానే సీఎం అభ్యర్ధి అంటూ సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించారు డీకే. పార్టీని పటిష్టం చేయడమే తన లక్ష్యమన్నారు. ఆయన తనకు నచ్చిన స్టేట్‌మెంట్ ఇచ్చుకోవచ్చు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని పటిష్టం చేసే బాధ్యతలు నాకు అప్పగించారు. ప్రభుత్వంతో పాటు పార్టీ ప్రయోజనాలను కాపాడడం నా బాధ్యత. నన్ను పదవి నుంచి తొలగించాలని అంటున్న వాళ్లనే ఆవిషయం అడగండి.. కాంగ్రెస్ పార్టీ తరపునే నేను మాట్లాడుతానని డీకే చెప్పారు.
ఢిల్లీలో సీఎం , డిప్యూటీ సీఎంకు ఘోర అవమానం జరిగిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. రాహుల్ ఇద్దరికి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఇందుకు నిదర్శనమంటున్నారు. సీఎం సిద్దరామయ్య మాటలను ఎవరు నమ్మడం లేదన్నారు బీజేపీ నేత బస్వరాజ్ బొమ్మై. సీఎం సిద్దరామయ్య తీరుతో రాజకీయ రచ్చ జరుగుతోంది. ఆయన మాటలను ఎవరు నమ్మడం లేదు. సీఎం పదవిపై అగ్రిమెంట్ లేదని , తననే సీఎంగా కొనసాగిస్తారని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టత ఇవ్వాలి. కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు మౌనంగా ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టత ఇచ్చే వరకు రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. పాలన స్తంభించింది. అవినీతి పెరిగిపోయింది. మంచి పాలన అందించాలి.. లేదంటే సీఎం పదవికి రాజీనామా చేయాలిని బస్వరాజ్ బొమ్మై డిమాండ్ చేస్తున్నారు.
మొత్తానికి సీఎం పదవిపై సిద్దరామయ్య , డీకే శివకుమార్ మధ్య గొడవ ఇప్పట్లో సమసిపోయే అవకాశాలు కన్పించడం లేదు. మరి దీనిపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? సిద్ద రామయ్యను కంటిన్యూ చేస్తుందా? లేక డికేకు అవకాశం ఇస్తుందా? చూడాలి మరి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి