తిరుమల, 12 జూలై (హి.స.)ఐఐఎం-అహ్మదాబాద్ టీమ్‌తో గ్రూప్ సూపర్ వైజర్లకు శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఈవో జె.శ్యామలరావు సూచించారు. శ్రీవారి సేవ స్వచ్చంద వ్యవస్థలో తీసుకురానున్న సంస్కరణలపై అదనపు ఈవో వెంకయ్య చౌదరితో తిరుమల అన్నమయ్య భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. త్వరలో ప్రారంభించనున్న ప్రొఫెషనల్ శ్రీవారి సేవ, ఎన్ఆర్ఐ సేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవల కార్యాచరణ పురోగతిపై చర్చించారు. ఈ సదర్భంగా ఈవో మాట్లాడుతూ ఎన్ఆర్ఐ సేవ, Professional సేవలను కూడా త్వరిత గతిన ప్రారంభించాలన్నారు. NRI సేవలను విస్తరించేందుకు APNRT సంస్థతో సంప్రదింపులు చేయాలని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను మరింత ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేయాలని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి