వరదతో పాటు శ్రీశైలానికి పోటెత్తిన పర్యాటకులు
కర్నూలు, 12 జూలై (హి.స.)ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది (Krishna river) ఉరకలేస్తుంది. ఆ నదిపై ఉన్న చిన్న చితక అన్ని డ్యాములు నిండిపోవడంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి లక్షకు పైగా వరద వస్తుండటంతో.. శ్ర
వరదతో పాటు శ్రీశైలానికి పోటెత్తిన పర్యాటకులు


కర్నూలు, 12 జూలై (హి.స.)ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది (Krishna river) ఉరకలేస్తుంది. ఆ నదిపై ఉన్న చిన్న చితక అన్ని డ్యాములు నిండిపోవడంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి లక్షకు పైగా వరద వస్తుండటంతో.. శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) వరుసగా 10వ రోజు వరద పోటెత్తింది. దీంతో అధికారులు 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి 1,37,635 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో 1,48,535 క్యూసెక్కులు ఉంది. వరద ఉదృితి కొనసాగుతుండటంతో.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 882.70 అడుగులు వద్ద ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande