ఢిల్లీ, 12 జూలై (హి.స.)షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో పాల్గొనడానికి విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) చైనాకు వెళ్లనున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో టియాంజిన్‌లో జరిగే ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన చైనా విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు సైతం జరపనున్నట్టు తెలుస్తోంది. షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా నగరమైన కింగ్‌డావోను సందర్శించిన కొద్ది రోజులకే జైశంకర్ పర్యటన జరగడం గమనార్హం. కాగా, 2020లో తూర్పు లడఖ్‌లో జరిగిన గాల్వన్ లోయ ఘర్షణ తర్వాత జైశంకర్ చైనాలో పర్యటించడం ఇదే మొదటి సారి. దీంతో ఈ టూర్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి