హైదరాబాద్, 14 జూలై (హి.స.)*
మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డులు పోస్ట్ చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు
వికలాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచాలని, వృద్దులు, వికలాంగులు, వితంతువులు సహా అన్ని రకాల పింఛన్లు పెంచాలని డిమాండ్
ఆరు గ్యారెంటీలను ప్రకటించిన సోనియా గాంధీ గారే ఈ హామీల అమలుకు చొరవ తీసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరిన కవిత
*కవిత కామెంట్స్*
* ప్రజల గుండెల్లో కేసీఆర్ గారిపై ఎంత అభిమానం ఉందో ఈ గ్రామ ప్రజలు తమ పాట ద్వారా చాటుకున్నారు
* రేవంత్ రెడ్డి ఒక్క కాకునూరు గ్రామ మహిళలకే ఈ 18 నెలల్లో రూ.5 కోట్లు బాకీ పడ్డారు
* మన ఇంటి అడబిడ్డలకు స్కూటీలు ఇప్పించేందుకు మనం అంధరం ఉద్యమించాలి
* కళ్యాణ లక్ష్మీ పథకానికి స్ఫూర్తినిచ్చింది ఇదే మహబూబ్ నగర్ జిల్లా
* లక్షలాది మంది అడబిడ్డల పెండ్లికి కేసీఆర్ గారు రూ. లక్ష ఇచ్చిండు
* కేసీఆర్ ఉత్తి లక్షనే ఇస్తుండు.. కాంగ్రెస్ ను గెలిపిస్తే తులం బంగారం కూడా ఇస్తామన్నారు.. ఒక్కరికి కూడా బంగారు ఇవ్వలేదు
* కేసీఆర్ జపం చేసుడు తప్ప రేవంత్ ఏం చేస్తున్నడు
* 90 శాతం పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు కేసీఆర్ గారి హయాంలో నే పూర్తయ్యాయి.. కానీ ఆ పనులు పూర్తి చేస్తలేడు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పనులు పక్కన పెట్టిండు
* కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టులో తట్ఠ మట్టి తియ్యకుండానే కాంట్రాక్టర్లకు రూ. వందల కోట్లు అడ్వాన్స్ లు ఇచ్చిండు
* రూ.2 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి ఆ పైసలు ఏం చేసిండు
* మూడు నెలల నుంచి పింఛన్లు ఇస్తలేరని అడబిడ్డలు చెప్తున్నరు
* రేవంత్ కొత్త గా ఏం చేయకున్నా పర్వాలేదు.. కేసీఆర్ గారు పెట్టిన గురుకులాను దారుణంగా, అన్యాయం గా మార్చేశారు
* గురుకులాల్లో బిడ్డలు చనిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపులేదు
**రేవంత్ బస్తీ మే సవాల్ అంటడు... తెల్లారే పరార్ అంటాడు*
*ఏ ఒక్కరోజు మాటపై నిలబడరు*
*కాంగ్రెస్ కు స్థానిక సంస్థల్లో వ్యతిరేకంగా ఓటు వెయ్యాలి..*
రెండుసార్లు రైతుబందు ఎగ్గొట్టిండు.. రుణమాఫీ, బోనస్ సహా ఇతర హామీలన్నీ ఎగ్గొట్టి.. ఇప్పుడు ఓట్ల కోసం రైతుల కు పైసలు ఇచ్చిండు
మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నామనే పేరు చెప్పి ఉన్న బస్సుల సంఖ్య తగ్గించిండు.. ఉచిత బస్సు ఇవ్వాల్సిందే.. కానీ బస్సు ల సంఖ్య పెంచాలి
*ఇది పని చేసే ప్రభుత్వం కాదు.. మనం వెంటపడితే తప్ప ఏ ఒక్క పని చేయదు*
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు