దేశానికే ఆదర్శంగా తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలు: మంత్రి సీతక్క
హైదరాబాద్, 14 జూలై (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు తెలంగాణ అంగన్ వాడీ కేంద్రాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క అన్నారు. పోషకాహార తెలగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మిషన్ మోడ్ లో పని చేస్తున్నదని తెలిపారు. తెలంగా
సీతక్క


హైదరాబాద్, 14 జూలై (హి.స.)

సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు తెలంగాణ అంగన్ వాడీ కేంద్రాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క అన్నారు. పోషకాహార తెలగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మిషన్ మోడ్ లో పని చేస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్ వాడీ సేవల బలోపేతం, చిన్నారులలో పోషకాహర మెరుగుదల, మహిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యం వంటి అంశాలపై రాష్ట్ర స్థాయి సమావేశం బేగంపేట టూరిజం ప్లాజాలో ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క.. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కు అనుగుణంగా అంగన్ వాడీ సేవలను మరింత మెరుగు పరుస్తామని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande