ఫిజికల్ రేషన్ కార్డులు ఇప్పుడే కాదు.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 14 జూలై (హి.స.) కొత్త రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నూతన రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా లబ్దిదారులకు రేషన్ కార్డు నంబర్ తో పాటు వారి కుటుంబ వివరాలను లబ్ధిదారుల జాబితాలో చేర్చబోతున్నట్లు
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి


హైదరాబాద్, 14 జూలై (హి.స.)

కొత్త రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి

కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నూతన రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా లబ్దిదారులకు రేషన్ కార్డు నంబర్ తో పాటు వారి కుటుంబ వివరాలను లబ్ధిదారుల జాబితాలో చేర్చబోతున్నట్లు చెప్పారు. వీరందరికి వచ్చే నెల నుంచి రేషన్ బియ్యం అందుతుందని చెప్పారు. రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ ప్రస్తుతం ప్రింటింగ్ దశలో ఉందని అది పూర్తయ్యాక ఫిజికల్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు. రేషన్ కార్డు మోడల్ పైనల్ అయిందన్నారు. దారిద్రరేఖకు దిగువన ఉన్నవారికి మూడు రంగలుతో కూడిన కార్డు, దారిద్రరేఖకు ఎగువన ఉన్నవారికి గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande