లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టులు.. ములుగు ఎస్పి
తెలంగాణ, ములుగు. 14 జూలై (హి.స.) నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు సోమవారం జిల్లా ఎస్పీ శబరిష్ సమక్షంలో లొంగిపోయారు. లొంగుబడ్డవారిలో ఒకరు ఏరియా కమిటీ సభ్యుడు హోదాలో ఉండగా, మిగిలిన నలుగురు మావోయిస్టు పార్టీ కార్యకర్తలుగా పనిచ
ములుగు ఎస్పి


తెలంగాణ, ములుగు. 14 జూలై (హి.స.)

నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు సోమవారం జిల్లా ఎస్పీ శబరిష్ సమక్షంలో లొంగిపోయారు.

లొంగుబడ్డవారిలో ఒకరు ఏరియా కమిటీ సభ్యుడు హోదాలో ఉండగా, మిగిలిన నలుగురు మావోయిస్టు పార్టీ కార్యకర్తలుగా పనిచేసినవారు. వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా, బీజాపూర్ జిల్లాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన సభ్యుల్లో శ్యామల రాజేష్ (22), కడ్తాల్దుమా (20), ఉకే జోగి (18), బొడిశే భీమా (21), ముచాకి జోగి (16) ఉన్నారు.

ఈ సందర్భంగా ములుగు ఎస్పీ శబరిష్ మాట్లాడుతూ, మావోయిస్టు ఉద్యమం ఆశించిన అభివృద్ధిని ఇవ్వకపోవడం, అడవుల్లో నిరంతరమైన పోలీసుల గస్తీలు, ఆదివాసీ ప్రజల సహకారం లేకపోవడం, ఆరోగ్య సమస్యలు, ఆహార కొరతలు ఇవన్నీ లొంగుబాటుకు కారణమయ్యాయి అని వెల్లడించారు. ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకం పెరగడంతో వారు శాంతియుత జీవితానికి మొగ్గుచూపారని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande