ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తోంది: కేటీఆర్
హైదరాబాద్, 18 జూలై (హి.స.) ఓటేసిన ప్రజలను కాంగ్రెస్ కాటికి పంపుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 20 నెలలో ఆ విషయం ప్రజలకు అర్థం అయ్యిందని అన్నారు. ఒక్కటి అంటే ఒక్క మాట కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోదు అని రాష్ట్ర ప్ర
Ktr


హైదరాబాద్, 18 జూలై (హి.స.)

ఓటేసిన ప్రజలను కాంగ్రెస్ కాటికి

పంపుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 20 నెలలో ఆ విషయం ప్రజలకు అర్థం అయ్యిందని అన్నారు. ఒక్కటి అంటే ఒక్క మాట కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోదు అని రాష్ట్ర ప్రజలకు క్లారిటీ వచ్చిందన్నారు. ఈరోజు ఎన్నికలు వచ్చినా ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి, బీజేపీ వాళ్లకు తెలుసు అని అన్నారు. కేసీఆర్ వంద సీట్లతో అధికారంలోకి వస్తారని చెప్పారు. తులం బంగారం ఇస్తామని, ఫించన్లను పెంచుతామని, బీసీ సబ్ ప్లాన్ అని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన భారీ ఆఫర్లను చూసి మోసపోయారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాల కారణంగా బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. వంద గ్యారెంటీలు ఇచ్చి కాంగ్రెస్ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మొనగాళ్లలా మంత్రులు తిరుగుతున్నారని విమర్శించారు. పొంగులేటి పోయిన దీపావళికి బాంబులు అన్నాడని ఇప్పటి వరకు పేలలేదని ఆయన బాంబులేటి అయ్యారని ఎద్దేవా చేశారు. మరో మంత్రి కమిషన్లలో బిజీగా ఉన్నాడని ఆరోపించారు. ఎరువుల కొరత రాష్ట్రమంతా కనిపిస్తుంటే వ్యవసాయమంత్రి ఏం చేస్తున్నారో అని ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande