హైదరాబాద్, 18 జూలై (హి.స.)
హైదరాబాద్ లోని బతుకమ్మకుంటలో నేడు హైడ్రా మొదటి వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంది. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నీటి వనరుల రక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణ లక్ష్యంగా ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ స్థాపించి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు అంబర్పేటలోని బతుకమ్మకుంట వద్ద వార్షికోత్సవ నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. హైడ్రా పేదలు, ధనవంతులు అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తుందని స్పష్టం చేశారు. చెరువుల ఆక్రమణలు తొలగించడంలో వేడుకలు దూకుడుగా వ్యవహరించామని, రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా పనిచేస్తామని పేర్కొన్నారు. హైడ్రా అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై కఠిన చర్యలతో అక్రమార్కులకు భయం కలిగించిందని, నగరంలో నీటి వనరుల రక్షణకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్