తిరుమల, 18 జూలై (హి.స.)
: తితిదే ఈవో జె.శ్యామలరావు పేరిట ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినట్లు తితిదే గుర్తించింది. గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ ఖాతాను సృష్టించి.. డబ్బులు కావాలని భక్తులకు సందేశాలు పంపుతున్నారని తెలిపింది. ఇది పూర్తిగా మోసగాళ్ల చర్య అని.. భక్తులు అప్రమత్తంగా ఉండాలని తితిదే పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘భక్తులు ఇలాంటి ఫేక్ అకౌంట్లకు దూరంగా ఉండాలి. ఎవరికైనా అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే తితిదే విజిలెన్స్ విభాగానికి తెలియజేయాలి. తితిదే విజిలెన్స్ నంబర్ 9866898630 లేదా టోల్‌ఫ్రీ నంబర్ 18004254141కు కాల్ చేసి సమాచారం అందించవచ్చు. భక్తులు కేవలం తితిదే అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org లేదా సోషల్ మీడియా అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి’’ అని తితిదే విజ్ఞప్తి చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ