ఉండవల్లి లో సీఎం చంద్రబాబు.అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ భేటీ
అమరావతి, 18 జూలై (హి.స.) ఉండవల్లి లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. 9 ప
ఉండవల్లి లో సీఎం చంద్రబాబు.అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ భేటీ


అమరావతి, 18 జూలై (హి.స.)

ఉండవల్లి లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. 9 ప్రధాన అంశాలు అజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చ సాగింది. రద్దీ ప్రాంతాల నిర్వహణ, మహిళా నేతలపై అసభ్య ప్రచారంపై మాట్లాడారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ, స్పేస్ సిటీ, పోలవరం-బనకచర్ల, హంద్రీనీవాపై, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీపై చర్చించారు. అమరావతి అభివృద్ధికి చర్యలు, మామిడిరైతులపై పార్లమెంటులో లేవనెత్తడంపై సీఎం దిశానిర్దేశం చేశారు. కాగా… జూలై 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande