స్వచ్ భార కేంద్రం అమల్లోకి.తెచ్చిన సూపర్ స్వచ్ లీగ్ 3.నుండి 10 లక్షలోపు.జనాభా గుంటూరు. కార్పొరేషన్ కు.పురస్కారం
అమరావతి, 18 జూలై (హి.స.) స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా కేంద్రం ఈ ఏడాది నుంచి అమల్లోకి తెచ్చిన సూపర్‌ స్వచ్ఛ లీగ్‌ (3 లక్షల నుంచి 10 లక్షల్లోపు జనాభా నగరాలు)లో గుంటూరు కార్పొరేషన్‌కు పురస్కారం దక్కింది. గురువారం దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించ
స్వచ్ భార కేంద్రం  అమల్లోకి.తెచ్చిన సూపర్ స్వచ్ లీగ్ 3.నుండి 10 లక్షలోపు.జనాభా గుంటూరు. కార్పొరేషన్ కు.పురస్కారం


అమరావతి, 18 జూలై (హి.స.)

స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా కేంద్రం ఈ ఏడాది నుంచి అమల్లోకి తెచ్చిన సూపర్‌ స్వచ్ఛ లీగ్‌ (3 లక్షల నుంచి 10 లక్షల్లోపు జనాభా నగరాలు)లో గుంటూరు కార్పొరేషన్‌కు పురస్కారం దక్కింది. గురువారం దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ, మేయర్‌ కోవెలమూడి రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరాం అందుకున్నారు. ఈ సందర్భంగా జీఎంసీ కమిషనర్‌ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ.. నగరాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రోత్సహిస్తున్న కేంద్రం 2014 నుంచి స్వచ్ఛ ర్యాంకులు ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా ప్రస్తుతం స్వచ్ఛత ప్రమాణాల్లో ఉన్నత స్థాయిలో నిలిచిన 23 నగరాలను సూపర్‌ స్వచ్ఛలీగ్‌ నగరాలుగా ప్రకటించిందని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande