అమరావతి, 18 జూలై (హి.స.)
అనంతపురం, :తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో ఈరోజు (శుక్రవారం) వైసీపీ ‘చంద్రబాబు రీకాలింగ్’ మేనిఫెస్టో కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ( ) పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లో తాడిపత్రికి వెళ్లేందుకు వీలు లేదని, తాడిపత్రిలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున తిమ్మంపల్లి నుంచి వెళ్లేందుకు వీలులేదని పోలీసులు స్పష్టం చేశారు. పెద్దారెడ్డి మినహా మిగిలిన వైసీపీ నేతలు సమావేశానికి హాజరుకావొచ్చని పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ