ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో.
అమరావతి, 20 జూలై (హి.స.) నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో గురువారం నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో పాటు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిస
ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో.


అమరావతి, 20 జూలై (హి.స.)

నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో గురువారం నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో పాటు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులతోపాటు.. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో 12 జిల్లాలకు వర్ష సూచన చేసింది.. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆదివారం అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande