తాడ్వాయి, 3 జూలై (హి.స.)
, : తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవం తేదీలను బుధవారం పూజారులు మేడారంలో ప్రకటించారు. మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం రోజున ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. ఎప్పుడూ ఫిబ్రవరి నెలలో వచ్చే ఈ జాతర ఈసారి పక్షం రోజుల ముందుగానే వచ్చింది. 2026 జనవరి 28వ తేదీ బుధవారం సారలమ్మ రాకతో జాతర ప్రారంభమవుతుంది. 29న గురువారం సమ్మక్క దేవత గద్దెకు రావడం, 30న శుక్రవారం భక్తులు మొక్కులు సమర్పించుకోవడం, 31వ తేదీ దేవతల వనప్రవేశంతో జాతర ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఈ సందర్భంగా కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ