'నన్ను డమ్మీ అన్నవాళ్లకు డాడీ అవుతా': తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, 3 జూలై (హి.స.)రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది కీరిటం కాదని.. బాధ్యత అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. బీఆర్ఎస్ ట్విట్టర్ పార్టీ దానితో ఎవరికీ ఉపయోగం లేదని.
బీజేపీ స్టేట్ చీఫ్


హైదరాబాద్, 3 జూలై (హి.స.)రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది కీరిటం కాదని.. బాధ్యత అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. బీఆర్ఎస్ ట్విట్టర్ పార్టీ దానితో ఎవరికీ ఉపయోగం లేదని.. మా పోటీ ఎప్పుడూ కాంగ్రెస్తోనే అన్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల మీద ఫోకస్ పెట్టాం.. వీలైనన్నీ ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాజాసింగ్ అంశం జాతీయ నాయకత్వం చూసుకుంటుందని చెప్పారు. తాను డమ్మీ లీడర్నా.. కాదా..? అనేది త్వరలో చూపిస్తా అని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. నన్ను డమ్మీ అన్నవాళ్లకు డాడీ అవుతా అని అన్నారు. మొత్తం తెలంగాణలో నా కంటే ఫైర్ బ్రాండ్ ఎవరూ లేరని కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు 14 సార్లు జైలుకు వెళ్లి వచ్చాను.. లాఠీ దెబ్బలు తిన్నాను, మావోయిస్టులతో పోరాటం చేశానని గుర్తుచేశారు. అందరినీ కలుపుకుపోవాలి అని ఉద్దేశంతోనే కూల్గా ఉంటున్నాను.. నా ఉగ్రరూపం చూస్తే తట్టుకోలేరు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చొక్కా గుండీలు విప్పి బూతులు మాట్లాడితేనే అగ్రెసివ్ లీడర్ కాదు.. సిద్ధాంతాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లగలిగిన వాడే అసలైన లీడర్ అని అన్నారు. ఆ నమ్మకం, సంకల్పం నాకుంది అని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు.. అందరం కలిసికట్టుగానే పనిచేస్తున్నాం అని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande