విశాఖపట్నం,, 3 జూలై (హి.స.)
:ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 13మందిని గురువారం నాడు సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 57 మొబైల్ ఫోన్లు,137 బ్యాంకు పాస్ పుస్తకాలు, 11 ల్యాప్ ట్యాప్‌లతోపాటు 132 ఏటీఎం కార్డులు, 4 సీసీ కెమెరాలు, కౌంటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ