అమరావతి, 3 జూలై (హి.స.)
: రాజధాని అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణకు అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. తాడికొండ మండల పరిధిలోని పాములపాడు, భేజాత్‌పురం, రావెల గ్రామాల్లో సభలు నిర్వహించిన ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆయా గ్రామసభల్లో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, గుంటూరు ఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజధాని భూ సమీకరణకు రైతులు అంగీకారం తెలుపుతూనే తమ డిమాండ్లను అధికారుల ముందుంచారు. భూ సమీకరణతో తాము కూడా రాజధాని ప్రాంతంలో చేరతామని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ రెండో విడత భూ సమీకరణకు రైతులు సానుకూలంగా ఉన్నారన్నారు. వారి డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ