కొండచరియలు విరిగిపడి ధ్వంసమైన జరాటి మల్లిగూడ రైల్వే ట్రాక్.పునరుద్ధరణ పనులు
విశాఖపట్నం, 3 జూలై (హి.స.) : కొండచరియలు విరిగిపడి ధ్వంసమైన జరాటి-మల్లిగూడ రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ట్రాక్‌ పునరుద్ధరణ పక్రియ కొనసాగుతోంది. దాదాపు 300 మంది కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఒడి
కొండచరియలు విరిగిపడి ధ్వంసమైన జరాటి మల్లిగూడ రైల్వే ట్రాక్.పునరుద్ధరణ పనులు


విశాఖపట్నం, 3 జూలై (హి.స.)

: కొండచరియలు విరిగిపడి ధ్వంసమైన జరాటి-మల్లిగూడ రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ట్రాక్‌ పునరుద్ధరణ పక్రియ కొనసాగుతోంది. దాదాపు 300 మంది కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు.

ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో రైల్వే ట్రాక్‌పై కొండచరియలు విరిగిపడి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొరాపుట్‌-జయపురం రైల్వేస్టేషన్ల మధ్య జరటి రైల్వేస్టేషన్‌ సమీపంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో జగదల్‌పూర్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్లే హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్, కిరండోల్‌-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు చేసినట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన మట్టి తొలగింపు పనులు చేపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande