127 ఏళ్ల తర్వాత భారత్‌కు బుద్ధుని అవశేషాలు
న్యూఢిల్లీ: 31 జూలై (హి.స.) బ్రిటిష్‌ హయాంలో భారత్‌ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలను 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి తీసుకొచ్చారు. ఈ వివరాలు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన సామాజికమాధ్యమ ఖాతా ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. శతాబ్దం తర్వాత బుద్ధు
వహ్్పగేూ


న్యూఢిల్లీ: 31 జూలై (హి.స.) బ్రిటిష్‌ హయాంలో భారత్‌ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలను 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి తీసుకొచ్చారు. ఈ వివరాలు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన సామాజికమాధ్యమ ఖాతా ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. శతాబ్దం తర్వాత బుద్ధుని అవశేషాలు భారత్‌కు తిరిగి రావడం నిజంగా దేశ సాంస్కృతిక వారసత్వానికి సంతోషకరమైన రోజు అని ప్రధాని మోదీ అభివర్ణించారు.

1898 సంవత్సరంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిప్రాహ్వా ప్రాంతంలో పురావస్తు తవ్వకాలు ముమ్మరంగా జరిగాయి. ఆ తవ్వకాల్లో బుద్ధుని పవిత్ర అవశేషాలు బయల్పడ్డాయి. అయితే నాటి బ్రిటన్‌పాలకులు భారత్‌ నుంచి ఈ అవశేషాలను యూకేకు తరలించారు.

‘‘ గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలు ఏకంగా 127 సంవత్సరాల అనంతరం మళ్లీ స్వదేశమైన భారత్‌కు తీసుకురావడం దేశ ప్రజలందరికీ ఎంతో గర్వకా రణం. బుద్ధుడు, ఆయన బోధనలతో భారత దేశానికి ఉన్న అనుబంధాన్ని ఈ పవిత్ర అవశేషా లు మరోసారి చాటిచెబుతున్నాయి’’ అని ‘ఎక్స్‌’ లో ప్రధాని మోదీ పోస్ట్‌పెట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande