న్యూఢిల్లీ, 31 జూలై (హి.స.)
మిత్ర దేశం అంటూనే భారత్పై తన అక్కసును వెళ్లగక్కారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్. 25 శాతం సుంకాలతో పాటు జరిమానాలు కూడా విధించారు. ఈ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే మన శత్రుదేశం పాకిస్థాన్తో జట్టుకట్టారు. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. పాక్తో భారీ చమురు నిల్వల అభివృద్ధికి ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. భారత్కు పాకిస్థాన్ ఏదో ఒక రోజు చమురు విక్రయించవచ్చని వెల్లడించారు. భాగస్వామ్యానికి నాయకత్వం వహించే చమురు కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియ కనసాగుతున్నదని తన సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా తెలిపారు.
'ఈ రోజు వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి వైట్హౌస్లో చాలా బిజీగా గడిపా. పలు దేశాల నాయకులతో మాట్లాడా. వారంతా అమెరికాను చాలా సంతోష పెట్టాలని అనుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం దక్షిణ కొరియాకు చెందిన వాణిజ్య బృందంతో చర్చలు జరుపనున్నా. కొరియా ప్రస్తుతం 25 శాతం సుంకాల జాబితాలో ఉంది. ఆ సుంకాలను తగ్గించుకునే ప్రతిపాద వారి వద్ద ఉంది. అది ఏంటో వినడానికి నేను ఆసక్తిగా ఉన్నా.
ఇప్పుడే పాకిస్థాన్తో ఒప్పందం కుదుర్చుకున్నాం. భారీ చమురు నిల్వల అభివృద్ధికి పాక్తో ఒప్పందం కుదిరింది. భాగస్వామ్యానికి నాయకత్వం వహించే ఆయిల్ కంపెనీని గుర్తించే పనిలో ఉన్నాం. పాకిస్థాన్ ఏదో ఒక రోజు భారత్కు చమురు విక్రయించవచ్చు. అనే దేశాలు సుంకాలను తగ్గించుకోవాలని అనుకుంటున్నాయి. ఇవన్నీ మన వాణిజ్య లోటును చాలా పెద్ద ఎత్తున తగ్గించడంలో సహాయపడతాయి' అంటూ ట్రంప్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..