ఆగస్టు 2న పీఎం కిసాన్‌ నిధుల విడుదల
న్యూఢిల్లీ: 31 జూలై (హి.స.)వ్యవసాయ రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ పథకం కింద అందిస్తున్న నిధులను ఆగస్టు రెండో తేదీన విడుదల చేయనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నిధుల
PM Modi in Lok Sabha


న్యూఢిల్లీ: 31 జూలై (హి.స.)వ్యవసాయ రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ పథకం కింద అందిస్తున్న నిధులను ఆగస్టు రెండో తేదీన విడుదల చేయనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.7 కోట్ల రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.20,500 కోట్లకు పైగా నిధులను ప్రత్యక్ష బదిలీ విధానం ద్వారా జమ చేయనున్నారు.

పీఎం కిసాన్‌ కింద ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో రూ.6,000 ఆర్ధిక సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 19వ విడత నిధులను విడుదల చేశారు. 19వ విడతతో ఈ పథకం కింద ఇంతవరకు మొత్తంగా పంపిణీ చేసిన మొత్తం రూ.3.69 లక్షల కోట్లకు చేరగా 20వ విడత నిధులతో ఈ మొత్తం ఏకంగా రూ.3.89 లక్షల కోట్లను దాటనుంది.

పంటల ఉత్పత్తిని పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తులకు న్యాయమైన ధరలను నిర్ధారించడం లక్ష్యంగా కేంద్రం ఈ నిధులను విడుదల చేస్తోంది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande