హైదరాబాద్, 6 జూలై (హి.స.) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు
జులై 7న మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన రాజధానిలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ అధిష్ఠానం మరియు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యూరియా ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో సీఎం రేవంత్, కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలవనున్నారని సమాచారం. రాష్ట్రానికి కావలసిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
అలాగే, హైదరాబాద్ మెట్రో రైల్వే రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్, రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ఉత్తర మరియు దక్షిణ భాగాలపై కేంద్ర స్థాయి చర్చలు జరుగనున్నాయి. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మద్దతు తీసుకోవడమే లక్ష్యంగా సీఎంలు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించనున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..