ఫాల్కన్ గ్రూప్ సీఓఓ అరెస్ట్ !
హైదరాబాద్, 6 జూలై (హి.స.) ఫాల్కన్ గ్రూప్‌ ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫాల్కన్ గ్రూప్‌ సీఓఓ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) ఆర్యన్ సింగ్‌ను సీఐడి అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ సంస్థ అధిక వడ్డీ ఇస్తామంటూ పెట్టుబడిదారులకు ఆకర్షణీయ
ఫాల్కన్ గ్రూప్


హైదరాబాద్, 6 జూలై (హి.స.)

ఫాల్కన్ గ్రూప్‌ ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫాల్కన్ గ్రూప్‌ సీఓఓ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) ఆర్యన్ సింగ్‌ను సీఐడి అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ సంస్థ అధిక వడ్డీ ఇస్తామంటూ పెట్టుబడిదారులకు ఆకర్షణీయ వాగ్దానాలు చేసి, దాదాపు 7,056 మంది డిపాజిటర్ల నుంచి రూ.4,215 కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.ఈ మోసం “ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్” పేరుతో అభివృద్ధి చేసిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నకిలీ సంస్థ ద్వారా సాగినట్లు గుర్తించారు.ఫాల్కన్ సంస్థ రూపొందించిన బోగస్‌ మొబైల్‌ అప్లికేషన్ ఆధారంగా ఈ స్కాం అమలైంది. ఆర్యన్ సింగ్ డైరెక్టర్ అమరన్‌తో కలిసి ఈ అవకతవకలకు పాల్పడినట్టు సీఐడీ చెబుతోంది.ఈ స్కామ్ కేసులో ఇప్పటివరకు సిఐడి అధికారులు 10 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేయ‌గా… ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande