గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలోని విశాఖపట్నం రైల్వేట్రాక్ సమీప విల్లాల్లో భారీ చోరీ
విజయవాడ, 6 జూలై (హి.స.) L, గుణదల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని విశాఖపట్నం రైల్వేట్రాక్‌ సమీప విల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ చోరీ జరిగింది. బాత్‌రూం కిటికీ అద్దాలు తీసి లోనికి ప్రవేశించిన దొంగలు.. ఇంట్లో యజమానులు నిద్ర పోతుండగానే 209
గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలోని విశాఖపట్నం రైల్వేట్రాక్ సమీప విల్లాల్లో భారీ చోరీ


విజయవాడ, 6 జూలై (హి.స.)

L, గుణదల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని విశాఖపట్నం రైల్వేట్రాక్‌ సమీప విల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ చోరీ జరిగింది. బాత్‌రూం కిటికీ అద్దాలు తీసి లోనికి ప్రవేశించిన దొంగలు.. ఇంట్లో యజమానులు నిద్ర పోతుండగానే 209 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.20వేల నగదు చోరీ చేశారు. గుణదల, సీసీఎస్‌ పోలీసులను ఉరుకులు పెట్టించిన ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి... గుణదల స్టార్‌ విల్లా-11లో ఉంటున్న వైట్ల సురేష్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. శనివారం ఉదయం నిద్రలేచి చూడగా.. అలమారా తెరిచి ఉంది. నగల బాక్సులు నేలపై పడి ఉన్నాయి. అందులో బంగారం కనిపించలేదు. బాత్‌రూమ్‌లోని కిటికీ అద్దాలు తొలగించి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే గుణదల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వెంటనే వచ్చేశారు. నేరం జరిగిన తీరును బట్టి.. అంతర్‌ రాష్ట్ర ముఠా పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. కిటికీల నుంచి లోపలికి ప్రవేశించి గుట్టుచప్పుడు కాకుండా నేరాలు చేసేది చెడ్డీ గ్యాంగ్‌ మాత్రమే అని పోలీసులు అంటున్నారు. నేరం జరిగిన విల్లాకు సమీపంలోని మరో విల్లా కిటికీ ఇనుప మెష్‌ విరగకొట్టి ఉంది. అక్కడ నేరం చేసేందుకు ప్రయత్నించి ఉంటారని, కుదరక వెనక్కి వెళ్లిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఈ కిటికీ అద్దాలు తీసి దొంగలు లోపలికి

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande