కర్నూలు, 6 జూలై (హి.స.)ఆంధ్రప్రదేశ్ రోడ్ల, భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇవాళ(ఆదివారం) ఉదయం బనగానపల్లె నుంచి కర్నూలు వైపు ఓ కార్యక్రమం నిమిత్తం వెళ్తున్నారు. ఈ క్రమంలో పాణ్యం-కర్నూల్ జాతీయ రహదారిపై ఓర్వకల్లు సమీపాన యాక్సిడెంట్‌లో గాయపడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని మంత్రి గమనించారు. వెంటనే కాన్వాయ్ ఆపిన మంత్రి ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ తరుణంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పరిస్థితిని గమనించిన మంత్రి వెంటనే తన కాన్వాయ్‌లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వయంగా ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లకు ఫోన్ చేసి, బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మానవత్వం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి